Skip to main content

మహిళా రిజర్వేషన్–డిలిమిటేషన్ బిల్లులను అడ్డగించిన కాంగ్రెస్ వైఖరిపై పల్లా ధ్వజం… మోదీ సంస్కరణలకు టీడీపీ సంపూర్ణ మద్దతు*


అమరావతి, ఏప్రిల్ 18:
* మహిళలకు న్యాయం చేసే, దేశానికి సమాన ప్రతినిధిత్వం కల్పించే కీలక బిల్లులను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం అడ్డుకోవడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లులపై ప్రతిపక్షం తీసుకున్న వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు  మాట్లాడుతూ… మహిళలకు లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడం, అదే సమయంలో పార్లమెంట్ సీట్లను 50 శాతం పెంచడం ఒకే దిశలో తీసుకున్న సరైన నిర్ణయమన్నారు. ఇప్పటివరకు రాజకీయాల్లో మహిళలకు తగిన అవకాశాలు లభించలేదు. ఇప్పుడు సీట్లు పెంచుతూ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం లేకుండా మహిళలకు అవకాశం కలుగుతుంది అని చెప్పారు.

డిలిమిటేషన్‌పై ఉన్న సందేహాలను కూడా పల్లా నివృత్తి చేశారు. జనాభా ఆధారంగా మాత్రమే సీట్లు పెరగవు. ప్రతి రాష్ట్రానికి సమానంగా సుమారు 50 శాతం సీట్లు పెరుగుతాయి. అందువల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న భయం అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా చూపుతూ, ప్రస్తుతం ఉన్న సుమారు 25 లోక్‌సభ స్థానాలు భవిష్యత్తులో దాదాపు రెండింతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇది అన్ని రాష్ట్రాలకు సమానంగా అవకాశాలు కల్పించే విధానం అని వివరించారు. మహిళా సాధికారతలో టీడీపీ ముందుండే పార్టీ అని పల్లా గారు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోనే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచామని గుర్తుచేశారు.

దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్కరణలను తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పల్లా శ్రీనివాసరావు గారు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు, రాష్ట్రాలకు న్యాయం చేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాలు స్వాగతించదగ్గవని అన్నారు. అదేవిధంగా, జనాభా ఆధారంగా మాత్రమే సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణ రాష్ట్రాలకు నష్టం కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన అంశం సత్యమని పల్లా   పేర్కొన్నారు. ప్రతిపక్షం ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా దేశానికి నష్టం కలిగించిందని విమర్శించారు. మహిళల హక్కులు, రాష్ట్రాల సమాన అవకాశాల కోసం టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని పల్లా శ్రీనివాసరావు   స్పష్టం చేశారు.

                   K.V.SHARMA EDITOR 


Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.