Skip to main content

విశ్వ మానవాళి . కేళి".

 అనంత కోటి 

జీవరాశులలో 

చరాచర సృష్టి 

కారకుడు బ్రహ్మ!

'మానవ జన్మ' కు 

అత్యంత ప్రాధాన్యత

నిచ్చి అందరి కన్నా 

అతీతంగా ఈ 

భూమి మీదకు 

స్త్రీ, పురుషులు 

గా వదిలి 

మానవాళి 

కేళి ని ఆస్వా 

దిస్తున్నాడు 

అని అనక 

తప్పదు.

మగ, ఆడ 

వారి వారి 

భావాలు వేరు 

అంత రంగాలు 

వేరు, ఆత్మ 

పరిశీలనలు వేరు,

ఆలోచన సరళులు 

వేరు, బాహ్య 

రూపాలు వేరు,

సంప్రదాయాలు 

వేరు, సంస్కారాలు 

వేరు, ఆచార

వ్యవహారాలు 

వేరు, ఐనా 

అందరూ ఆస్కారాల 

కోసం వేచి చూస్తారు.

బహుముఖ ప్రజ్ఞ 

మానవ మాతృనికే 

చెల్లింది.

ప్రజ్ఞ, విజ్ఞత,

వినయ విధేయత,

సంయమనం 

కొందరి సొంతం.

ఇక అహంకారం,

దురుద్దేశం,

దుర్మార్గం,

స్వార్ధం,

సంకుచిత్వం 

కూడా వారికే 

చెల్లింది.

లోక కళ్యాణాని 

కైనా, వినాశనాని 

కైనా వారే కారకులు 

కారణ భూతులు.

మానవ మేధస్సు 

అలాంటిది.

పాలకుడు వాడే,

పీడించే వాడు వాడే,

పరిశీలకుడు వాడే,

పరిశోధకుడు వాడే,

సద్గుణ సంపన్నుడు 

వాడే, దుర్గుణ 

దుర్మార్గుడు వాడే,

ప్రతీ చర్య కు 

మూలం, అలవాలం 

మానవుడే.

యుద్ధాలకు 

సంసిద్దుడూ తానే,

ప్రతీకారం తన 

పరమావధి.

చర్య కు ప్రతి చర్య.

దేశాల నడుమ 

జగడాలు, 

సరిహద్దుల వెంట 

బలగాలు,

మొహరింపులు,

బల ప్రదర్శనలు,

దురాక్రమణలు,

ప్రతీకార జ్వాలలు,

యుద్ధ మేఘాలు,

సంపన్న దేశాల 

నడుమ ఆధిపత్య 

పోరు, జలసంధులు,

ఒడంబడికలు,

సముద్ర జలాల 

హద్దులు, దాడులు,

మత్య సంపదపై 

కన్ను, హద్దులు దాటి

వేట, దోపిడీ,

అవకాశ వాదం,

వినాశ కాలే 

విపరీత బుద్ధి 

మానవ నైజం,

ద్విగుణీ కృతం.

పాప భీతి 

కానరాదు.

దుర్నీతి,

నిరంకుశ ధోరణి,

నేటి విశ్వ మాన

వాళి కేళి.

విశ్వ శాంతి 

కోరుకునేది 

తదనుగుణం గా 

అడుగులు 

వేసేది, భారత 

దేశం మాత్రమే.

భారతీయ 

సంస్కృతి 

సంప్రదాయాలు 

ప్రతీక, ఉపయుక్తం గా,

కొన్ని దేశాలు 

భావించినా, కొన్ని 

అగ్ర దేశాలకు,

పాక్ లాంటి పన్నాగ

పూరిత కుట్రదారులకు 

అవి రుచించడం 

లేదు, మింగుడు 

పడటం లేదు.

మన భారతీయ 

నాగరి కతను 

ఇష్ట పడరు.

లోక కళ్యాణం 

భారతీయ 

సంస్కృతి 

సంప్రదాయం 

తోనే సాధ్యం,

అప్పుడే ఈ 'కేళి'

ని కొంత వరకైనా 

అరికట్టగలం,

అడ్డుకట్ట 

వేయగలం.               

                      


                         Dr. నండూరి రామకృష్ణ

                                  14.04.2026

Comments