Skip to main content

అత్యంత ఆకర్షణీయంగా త్రిశూల్ ను తీర్చిదిద్దాలి. * పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు

                       K.V.SHARMA EDITOR 


ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి పై పర్యాటకులను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటున్న త్రిశూల్ ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు అన్నారు. బుధవారం ఉదయం కైలాసగిరి పై త్రిశూల్ నిర్మాణ పనుల ప్రగతిని ఆయన పరిశీలించారు.


 ఈ నెలాఖరులోగా త్రిశూల్ ను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్రిశూల్ పరిసరాలు మరింత సుందరంగా ఉండేలా పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. సందర్శకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, బెంచీలు, తాగునీరు  వంటి సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సందర్శకులను ఆకర్షించే విధంగా శివ లింగాకార నమూనాలో వర్టికల్ గార్డెనింగ్ పెంపొందించాలని ఆదేశించారు.


 అదేవిధంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సి సి కెమెరాలను అమర్చాలని సూచించారు. అధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంతం మొత్తం తీర్చిదిద్దాలని సూచించారు.


 వేసవి సెలవులు నేపథ్యంలో కైలాసగిరి కి వచ్చే సందర్శకులు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు నుంచి తెలుగు మ్యూజియం వరకు నిర్మించిన రహదారిని సత్వరమే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఘాట్ రోడ్డు లో అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ గారు, ప్రధాన ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్ గారు, కార్యనిర్వహక ఇంజనీర్లు శ్రీ భవాని శంకర్ గారు, శ్రీ మధు గారు, DFO శ్రీమతి  శిరీష అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.