Skip to main content

సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రవేశాల దరఖాస్తుల జారీ ప్రారంభం


విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తుల జారీ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ తెలిపారు.


డిగ్రీ స్థాయిలో బిఏ, బిబిఏ, బీకాం, బిసిఏ, బీఎస్సీ (అగ్రికల్చర్ & రూరల్ డెవలప్మెంట్), మైక్రోబయాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, ఎంఇసీ గ్రూపుల్లో కూడా ప్రవేశాల కోసం దరఖాస్తులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.


ఆసక్తిగల విద్యార్థినులు కళాశాలలోని అన్ని పని దినాల్లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు దరఖాస్తులను పొందవచ్చని కళాశాల పీఆర్వో డాక్టర్ పి.కే. జయలక్ష్మి తెలిపారు.


కళాశాలలో హాస్టల్ వసతి, జిమ్, కాంటీన్, ఎటిఎం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు
.

ఆసక్తి గల విద్యార్థినులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

Comments