Skip to main content

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు....

                 Srinivas Spl Correspondant 


అమలాపురం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వజయంతి సందర్భంగా మంగళవారం  అమలాపురం గడియార స్తంభం సెంటర్, మరియు ఈదరపల్లి వంతెన వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్  పార్టీ నాయకులు పూలమాలలు వేసిన ఘన నివాళులు  అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు  కొత్తూరి శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్  అయితా బత్తుల సుభాషిని, కెకెసి  రాష్ట్ర అధికార ప్రతినిధి, పట్టణ అధ్యక్షులు  వంటెద్దు బాబి, ఏఐసీసీ మెంబర్ యార్లగడ్డ రవీంద్ర, బీసీ నాయకులు  కుడికూడి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు సుగ్గు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరపల్లి రాజేంద్ర బాబు, రూరల్ మండల అధ్యక్షులు పోలిశెట్టి హరిబాబు, ఏలేశ్వరపు రాధాకృష్ణ, మహబూబ్ షకిలా, గంటి ప్రవీణ్ కుమార్, జోగి అర్జున్ రావు, పులుసుగంటి ప్రకాష్, ఈతకోట సోమరాజు, దంగేటి రమణ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.