Skip to main content

అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా విజయలక్ష్మి


అమలాపురం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా విజయలక్ష్మి  నూతనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.  ఈ సందర్బంగా   విజయలక్ష్మి మాట్లాడుతూ  వార్డు గ్రామ పరిధిలో పచ్చదనం పెంచే కార్యక్రమాలను ప్రోత్సహించడం జరుగుతుందని, పరిపాలన 


సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతుందన్నారు.  ​నైపుణ్యాభివృద్ధి ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు కొత్త  సాంకేతికతపై శిక్షణ ఇస్తామన్నారు. నగదు నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు మరియు ప్రభుత్వ ఆస్తుల రికార్డులను కాలానుగుణంగా తనిఖీ చేయడం, జిల్లా స్థాయి స్పందనలో వచ్చే ఫిర్యాదులను స్వర్ణ సచివాలయ అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరించడం జరుగు తుందన్నారు. వారానికి కనీసం రెండు సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుందన్నారు.            


స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ప్రత్యేక లక్ష్యాలైన పౌరులకు సంక్షేమ పథకాల అమలు మరియు చెత్త సేకరణ అంశంలో నూటికి నూరు శాతం నాణ్యమైన సేవలు సమయానుకూలంగా అందిస్తానన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలను సాధించడం జరుగుతుందన్నారు. ఆస్తి నీటి పన్ను వసూళ్లు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పారదర్శకత కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన అధికారికి  సిబ్బంది  పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సువిజయ్, సిబ్బంది పాల్గొన్నారు.

                Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.