సహజ పానియాలనే సేవించండి ...జనవిజ్ఞాన వేదిక..... కూల్ డ్రింక్స్ వద్దు.... కొబ్బరి బొండాలే ముంద్ధాంటూ విద్యార్థుల ర్యాలీ .....
Srinivas. Spl Correspondant
మల్కిపురం, విశాఖ సందేసం...డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనవిజ్ఞాన వేదిక శాఖ ఆధ్వర్యంలో మలికిపురంలో కూల్ డ్రింక్స్ వద్దు.... కొబ్బరి బొండాలే ముంద్ధాంటూ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. వేసవిలో ఎక్కువమంది దాహం వేసినప్పుడు శీతల పానీయాలను సేవిస్తూ ఉంటారు కానీ వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని జనవిజ్ఞాన వేదిక డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.వి.వర ప్రసాద్ అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద స్కూల్ విద్యార్థులు శీతల పానీయాలు వద్దు... సహజ పానియాలే ముద్దు..

అనే కరపత్రం ఆవిష్కరించారు. శీతల పానీయాలకు ప్రత్యామ్నాయంగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని ఆయన సూచించారు.సుమారు 300 మంది విద్యార్థులు కొబ్బరి బొండాలతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు శీతల పానీయాలు త్రాగకుండా ఆరోగ్యం కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జె వి వి మండల ప్రధాన
కార్యదర్శి కె.సునీల్ బాబు, జిల్లా సాంస్కృతిక శాఖ బాధ్యులు సి.హెచ్ తులసీ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్. రమేష్ బాబు ,స్కూల్ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments
Post a Comment