Skip to main content

అల్లవరం డిప్యూటీ ఎంపీడీఓగా అచ్చిరాజు బాధ్యతలు స్వీకరణ.....


అల్లవరం, విశాఖ సందేసం....కాకినాడ రూరల్ మండలం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై అల్లవరం మండలం  ఉప మండల అభివృద్ధి అధికారిగా అచ్చిరాజు డి.ఎల్.పి.ఓ బొజ్జరాజు, అల్లవరం మండల అభివృద్ధి అధికారిణి గౌరీకుమారి సమక్షంలో గురువారం మండల  పరిషత్ కార్యాలయం నందు బాధ్యతలను స్వీకరించారు. డిప్యూటీ ఎంపీడీఓగా అచ్చిరాజు బాధ్యతలను స్వీకరించిన అనంతరం డి.ఎల్.పి.ఓ బొజ్జరాజు, అల్లవరం మండల అభివృద్ధి అధికారిణి గౌరీకుమారి, మల్కిపురం డిప్యుటీ ఎంపీడీఓ ఆర్.ఎస్.ఎస్ సూరప రాజు, 


విశ్రాంత గ్రామపంచాయతీ కార్యదర్శి అడబాల ఎస్.ఎస్.ఎస్. రాజేశ్వరరావు(రాజా), మండల పరిషత్ పరిపాలన అధికారి శర్మ, అల్లవరం గ్రామపంచాయతీ కార్యదర్శి రెడ్డి శిరీష  లు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ అచ్చిరాజు మాట్లాడుతూ  ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యోగుల సహాయ సహకారాలతో అల్లవరం మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేసారు.

Comments