Skip to main content

అంబరాన్నంటిన జనసేన సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు.. శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆనందరావు

             Srinivas Spl Correspondant 


అమలాపురం,  విశాఖ సందేసం..
..అమలాపురం నియోజకవర్గం  జనసేన  సీనియర్ నాయకులు  నల్లా శ్రీధర్ పుట్టినరోజు సందర్బంగా  అభిమానులు ఆదివారం స్థానిక నల్లా వీధిలోని జనసేన కార్యాలయం వద్ద అత్యంత ఘనంగా పుట్టినరోజు  వేడుకలను ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, కార్యకర్తలు పూల పుష్పగుచ్చాలను,  దుస్సాలువాలు, గజమాలతో శ్రీధరను సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కేక్ కట్


చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిదులుగా  అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు పలు  సేవా కార్యక్రమాలు  నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమి నేతలు, జనసేన నాయకులు, వీర మహిళలు, నల్లా శ్రీధర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments