K.V.SHARMA EDITOR
విశాఖపట్నం ఏప్రిల్ 16: నగర నిత్య పరిశుభ్రతే ధ్యేయంగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించేలా జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులు చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తూర్పు జోన్ 21వ వార్డు పరిధిలోని పాత సిబిఐ డౌన్ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులే కీలకమని, నిత్యo నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు నిర్ణీత సమయానికే విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టాలని అందుకు జీవీఎంసీ సహాయ వైద్యాధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ కార్యదర్శులు బాధ్యతగా పారిశుధ్య కార్మికులచే విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు హాజరు తప్పనిసరిగా చూడాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లపై పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి అవగాహన కలిగి ఉండేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. నివాసితులు బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేస్తే వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వార్డులో, రోడ్డు మార్గంలోను, బహిరంగ ప్రదేశాలలో భవన నిర్మాణ వ్యర్ధాలు వేస్తే వెంటనే ఆ వ్యర్ధాలను వార్డ్ సచివాలయం ప్లానింగ్ కార్యదర్శులు ద్వారా తరలించే ప్రక్రియ చేపట్టాలని , భవన నిర్మాణం వ్యర్ధాలు వేసే యజమానుల నుండి అపరాధ రుసుములు వసూలు చేయాలని ఆదేశించారు.
నిత్యం నిర్ణీత సమయానికే క్లాప వాహనాలు విధులకు వచ్చి చెత్త సేకరణ చేస్తున్నాయని స్థానికులను ఆరా తీశారు. తదుపరి ఆ మార్గంలో వస్తున్న క్లాప్ వాహనాన్ని ఆపి క్లాప్ వాహనంపై ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసిన విజిల్స్ సిస్టం, మైక్ అనౌన్స్మెంట్ ఎందుకు వినియోగించలేదని డ్రైవర్ పై,లోడర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై ప్రజల అవగాహన కొరకు డోర్ టు డోర్ వ్యర్ధాలు సేకరణకు వెళ్ళినప్పుడు మైకు సిస్టం తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారి బి. ప్రసాద్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ గోవిందరావు, వార్డు సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
*పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ*




Comments
Post a Comment