Skip to main content

గ్రామ ప్రజల సహాయ సహకారాలు నా జీవితంలో మర్చిపోలేను : రాకాపు విజయలక్ష్మి.... ఐ.ఎస్.ఓ పంచాయతిగా తీర్చిదిద్దిన ఘనత సర్పంచ్ విజయలక్ష్మి : ఎంపీపీ శేషగిరిరావు.... సర్పంచ్, పాలకవర్గం సభ్యులకు ఘనంగా సన్మానం.....

అల్లవరం, విశాఖ సందేసం..
కొమరగిరిపట్నంగ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు,సచివాలయాల ఉద్యోగులు, సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి, ఐఎస్ఓ గుర్తింపు సాధించడం  నా జీవితంలో మర్చిపోలేనని సర్పంచ్  రాకాపు విజయలక్ష్మి అన్నారు.. కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం  పంచాయితీ ప్రత్యేక అధికారి మేడిద నారాయణరావు, కార్యదర్శి చిక్కం శ్రీను, ఆధ్వర్యంలో  సర్పంచ్ రాకాపు విజయలక్ష్మి, ఉప సర్పంచ్ గుర్రం శ్రీను, పాలకవర్గ సభ్యులను ఘనంగా  సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఎంపీపీ శేషగిరిరావు  సర్పంచ్, పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ కొమరగిరిపట్నం ప్రజలు ఆదరణతోటే తను  గెలుపొందానని, గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్ళమని అన్నారు. 

కొమరగిరిపట్నం గ్రామంలో మంచినీరు చెరువు అభివృద్ధి అయిదు కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని అల్లవరం ఎంపిపి ఇళ్ల శేషగిరిరావు తెలిపారు. సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఆదరణతో గ్రామాభివృద్ధి జరిగిందని, నా ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల నుండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించామని, త్రాగునీటి సమస్య కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించామని తెలిపారు. కరోనా టైంలో రెండు సంవత్సరాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ,  అభివృద్ధి బాటలో నడిపించామని తెలిపారు. గ్రామంలోకి కేరళ నుంచి వచ్చిన బృందం రాష్ట్రంలో 24 పంచాయతీలలో మన పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. ఈ 

కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నడింపల్లి సీతారామరాజు, అల్లూరి సురేష్ రాజు, ఎంపీటీసీలు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, మామిడి శెట్టి శ్రీనివాస్, సహకార సంఘం మాజీ అధ్యక్షులు గుని శెట్టి రోహిణి కుమార్, పరస కిరణ్ కుమార్, నిమ్మకాయల శేఖర్, దండు బుజ్జి, దాట్ల బుజ్జి రాజు, బీహెచ్ రాజు, పోచనపెద్ది పెద్ది వెంకటేష్, నల్లా రాము మూడు పంచాయతీల సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు

Comments