అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిభిరం.... అల్లవరం ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదానం చేసిన యువకులు....
అల్లవరం, విశాఖ సందేసం డా. బి.ఆర్. అంబెడ్కర్ 135 వ జయంతి సందర్భంగా అల్లవరం ప్రభుత్వ హాస్పిటల్ నందు శుక్రవారం మెడికల్ ఆఫీసర్ డా. ఎన్. రాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తధాన శిభిరాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బండిగుప్తపు ప్రారంభించారు. ఈ రక్తదాన శిభిరంలో సుమారు 25 మంది యువకులు రక్తదానం చేసారు.. ఈ సందర్భంగా అంబెడ్కర్ స్ఫూర్తి తో రక్త దానం చేసిన రక్త దాతలను అభినందిస్తూ బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్ లను ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది అందజేశారు.
ఈ కార్యక్రమంలో పోతుల నాగార్జున నాయుడు, సాపే రమేష్, జనుపల్లి సంపత్ కుమార్, సతీష్, డా. రాకేష్ మరియు 20 మంది రక్తదానం చేశారు. ఈ సందర్బంగా నాతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిభిరాల్లో రక్తదానం చేయడం వల్ల అవసరం అయిన పేషెంట్లకు సకాలంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడవచ్చునని అలాగే రక్త దానం చేసినవాళ్లు మిగతావారికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.ఈ సందర్బంగా రక్తదాతలను, హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిత్తుగ సత్యనారాయణ, కొనుకు రమేష్, ఊటాల రాంబాబు, ఈతకోట వెంకటరమణ, ఆసుపత్రి సిబ్బంది నరసింహా, తదితరులుపాల్గొన్నారు.



Comments
Post a Comment