విశాఖపట్నం ఏప్రిల్ 7: నగరంలో నిత్యం ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియను అలవర్చుకొని నగరాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన వేస్ట్ టు వండర్ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి జోన్ 89వ వార్డులోని యల్లపువానిపాలెం లోని ఆదర్శ గ్రామంలో కృష్ణయ్య గృహంలో మిద్దె తోటల పెంపకం, ప్లాస్టిక్ పునర్వినియోగ ప్రక్రియ మొదలైన పర్యావరణహిత ఆవరణాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ వ్యర్ధాల పునర్వినియోగ ప్రక్రియ ద్వారా పర్యావరణహితంగా వినూత్నమైన వస్తువులను తయారు చేయవచ్చునని, వ్యర్ధాల పునర్వినియోగించడం ద్వారా ఆర్థిక లాభం పొందవచ్చునని, తద్వారా నగర పరిశుభ్రత, పర్యావరణానికి నగర ప్రజలు సహకరించాలని తెలిపారు. యల్లపువానిపాలెం లో గల కృష్ణయ్య అనే నివాసితులు తమ గృహంలో వ్యర్ధాల పునర్వినియోగం చేయు విధానాన్ని పరిశీలించి ఆయనను అభినందించారు. సేంద్రియ ఎరువు ఇంట్లోనే తయారు చేసి గార్డెన్ మొక్కలకు ఎరువుగా వినియోగించడం
.jpeg)
ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించడం వంటి వాటిని పరిశీలించారు. ఖాళీ సీసాలతో ప్లాంట్ పాట్స్ లేదా డ్రిప్ ఇర్రిగేషన్ గా తీర్చిదిద్దడంతోపాటు బాటిల్స్ లో ప్లాస్టిక్ వ్యర్ధాలతో గట్టిగా నింపడం ద్వారా ఏకో బ్రిక్ తయారు చేశారని తెలిపారు. ఇటువంటి పర్యావరణ హితమైన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టడం ద్వారా నగర పర్యావరణాన్ని కాపాడగలుగుతామని, పచ్చదనాన్ని పెంపొందించుకోగలమని తెలిపారు. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ర్యాంకు సాధనకు ప్రజలందరూ సహకరించాలని అదనపు కమిషనర్ కోరారు.
ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారి జె .కృష్ణంరాజు శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డ్ శానిటేషన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి.
.jpeg)
.jpeg)
Comments
Post a Comment