Skip to main content

బిజెపి తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ రవి రాజ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సమావేశం*


పార్టీ తూర్పు నియోజకవర్గ మండల అధ్యక్షుల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ రవి రాజ్ అధ్యక్షతన బీజేపీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశురామరాజు గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ఈ సందర్భంగా పరశురామరాజు గారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎస్ఐఆర్ గురించి మండల అధ్యక్షులకు పలు సూచనలు చేసి ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారయ్యే విధంగా సమర్థవంతమైన కార్యకర్తలను బిఎల్ఎ -2 లుగా నియమించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, బీజేపీ ST మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్ మరియు నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

                  K.V.SHARMA EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.