తిరుమల.. ఏప్రిల్ 8 :తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు. ప్రత్యేక ఆహ్వానితులు .జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
డాక్ యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.. తెల్లవారుజామున విఐపి విరామ
దర్శన. సమయంలో గంట్ల శ్రీనుబాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.. స్వామి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా మృదు మధుర మంగళ వాయిద్యాలు నడుమ అర్చక స్వాములు ఆశీస్సులు అందించి శేష వస్త్రంతో సత్కరించి.. శ్రీవారి ప్రసాదం అందజేశారు.. సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని తాను స్వామిని కోరుకున్నట్లు చెప్పారు..
అలాగే పాప వినాశనం. ఆకాశ గంగ.. వేణుగోపాలస్వామి ఆలయం.. ఆంజనేయ స్వామి ఆలయం తో పాటు తిరుమలలో కొలువున్న శ్రీ వరహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు...

Comments
Post a Comment