Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR
సామాజిక చీకట్లను చీల్చుతూ అక్షర జ్యోతులను వెలిగించిన మహా మనీషి, మహాత్మ జ్యోతిబా పూలే ఆదర్శాలు నేటి సమాజానికి దిక్సూచి అని తెలిపిన పోలీసు కమిషనర్ గారు పోలీసు కమిషనరేట్ నందు పూలే జయంతి సందర్బంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు.*
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.... అంటరానితనం, కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలు రాజ్యమేలుతున్న కాలంలో.. కేవలం విద్యతోనే విముక్తి సాధ్యమని నమ్మిన ధీశాలి పూలే అని ప్రశంసించారు. 1848లోనే తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలిని చేసి, బాలికల కోసం పాఠశాల స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన కృషి భారత చరిత్రలో చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR


Comments
Post a Comment