భారతీయ హోమియోపతికి పెరుగుతున్న ప్రజా ఆదరణప్రపంచ వైద్య రంగంలో అగ్రగామిగా భారత్: ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ముగిసిన ప్రపంచ హోమియోపతి వారోత్సవాలు
విదేశీ మూలాలు - భారతీయతను పులుముకున్న వైద్యం - అధిక ఆదరణతో
ఈ ముగింపు సభలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద కుమార్ పింగళి మాట్లాడుతూ, హోమియోపతి వైద్యం జర్మనీలో డాక్టర్ శామ్యూల్ హానిమాన్ ద్వారా ప్రారంభమైనప్పటికీ, అది నేడు భారతీయ జీవనశైలిలో ఒక భాగమైందని అన్నారు. నేడు ఇది కేవలం విదేశీ శాస్త్రం కాదు, భారతీయులందరి ఆదరణ పొంది భారతీయ హోమియోపతిగా రూపాంతరం చెందింది. అతి తక్కువ ఖర్చుతో, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోందని డాక్టర్ పింగళి పేర్కొన్నారు.
హోమియోపతికి ప్రపంచ కేంద్రంగా భారత్భా రతదేశం హోమియోపతి రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారిందని చెబుతూ డాక్టర్ పింగళి పలు కీలక గణాంకాలను వెల్లడించారు. భారతదేశంలో ప్రస్తుతం 20 కోట్లకు పైగా ప్రజలు క్రమం తప్పకుండా హోమియోపతి వైద్యాన్ని వినియోగిస్తున్నారు. 3 లక్షలకు పైగా నమోదిత వైద్యులు, 300కు పైగా హోమియోపతి వైద్య కళాశాలలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతున్న రెండో వైద్య విధానంగా హోమియోపతి గుర్తింపు పొందిందని, దీని అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు.
- ఎముకల సాంద్రత పరీక్ష (BMD Test) నిర్వహించి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని గుర్తించారు.
- డయాబెటిస్ (HbA1c), లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి సమగ్ర మెటబాలిక్ పరీక్షలు నిర్వహించారు.
- ఊబకాయం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఉచిత సంప్రదింపులు అందించారు.
భవిష్యత్ లక్ష్యాలు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ (AYUSH) విభాగం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహాన్ని డాక్టర్ పింగళి కొనియాడారు. హోమియోపతి వైద్యం కోసం విదేశీయులు సైతం భారత్‌కు వస్తున్నారని, ఇది వైద్య పర్యాటక రంగానికి (Medical Tourism) ఎంతో దోహదపడుతుందని అన్నారు.
వారమంతా నిర్వహించిన గ్రామీణ వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్యం కోసం హోమియోపతి అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేశాయని డాక్టర్ పింగళి సంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలోని రెగ్యులర్ ఓపిడి (OPD), పెరిఫెరల్ ఓపిడిలు మరియు ఇన్-పేషెంట్ విభాగం (IPD) ద్వారా ప్రజలకు నిరంతరం అంకితభావంతో, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.


Comments
Post a Comment