Skip to main content

విశాఖలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి చీఫ్ మాధవ్


 భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.


 విశాఖ బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరుశురామ్ రాజు గారి అధ్యక్షతన, రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ బొత్స సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ శ్రీ పివిఎన్ మాధవ్ గారు మరియు విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కలిసి  జెండాని ఆవిష్కరించారు. 


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047వ సంవత్సరం కల్లా వికసితభారత్ కల శాకారమయ్యేలాగా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు సారధ్యంలో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.


 స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా మరియు ఆత్మ నిద్బర భారత్ వంటి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కోరారు.


 భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలిపేందుకు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్బంలో కృషి చేస్తుందని తెలిపారు.


 కార్యక్రమంలో జిల్లా నాయకులు,మండల అధ్యక్షులు, వార్డ్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments