Skip to main content

ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు ను ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు ప్రారంభించారు.


 ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులకు  ఉపయుక్తంగా నిలిచే విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు ను ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్ ఈరోజు ప్రారంభించారు. హోమియో వైద్యశాల నుంచి నాగార్జున హాస్టల్ కి వెళ్లే మార్గంలో, అర్థశాస్త్ర విభాగం నుంచి కలెక్టర్ బంగాళాకి వెళ్లే మార్గంలో మధ్యలో ఉన్న కూడలిలో నూతనంగా వీటిని ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యార్థులు సురక్షితంగా విభాగాల నుంచి హాస్టల్స్ కు వెళ్లడానికి ఇది ఈ ఫ్లడ్ లైట్లు ఉపయుక్తంగా నిలుస్థాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు వెలుగులో ఈ కూడలి మార్గం ఎంతో ప్రకాశవంతంగా మారింది.

 అదేవిధంగా ఏయూలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ దీపాలను అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ఇంజనీరింగ్ అధికారులు, డీన్ లు తదితరులు పాల్గొన్నారు.

                   K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.