గ్రామభివృద్ధికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు : సర్పంచ్ పెనుమాల సునీత.... సర్పంచ్ సునీత ఏడుకొండలు దంపతులకు ఘనంగా సన్మానం.....
అమలాపురం, విశాఖ సందేసం...గ్రామ అభివృద్ధికి సహకరించిన బండారులంక గ్రామ ప్రజలు, కూటమి నాయకులకు గ్రామపంచాయతీ సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు కృతజ్ఞతలు తెలియజేశారు. పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసిన సందర్బంగా బండారులంక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు టీడీపీ నాయకులు శంకర్ మూర్తి, శ్యామ్ ఆధ్వర్యంలో సర్పంచ్ దంపతులు పెనుమాల సునీత ఏడుకొండలను పూలమాలలు వేసి దూస్సాలువాలు కప్పి అత్యంత ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సునీత మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో వడిదుడుకులను కూటమి నాయకులు, ప్రజలు సహకారంతో ఎదుర్కొని గ్రామభివృద్ధికి పాటు పడ్డనని అన్నారు. శంకర్ మూర్తి మాట్లాడుతూ అధికారంలో ఉన్నా ఇప్పటి వైసీపీ ప్రభుత్వం మహిళా సర్పంచ్ సునీత పై ఎన్ని కుట్రలు చేసిన తట్టుకుని పాలన చేసారాని అభినందనలు తెలిపారు. శ్యామ్ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో టీడీపీ పార్టీతో ముందుకు సాగుతానని మాట ఇచ్చిన సునీత దంపతులు మాట నిలబెట్టుకుని బండారులంక గ్రామ ప్రజల, టీడీపి క్యాడర్ గుండెల్లో నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యమంతుల రజిని,బూత్ కమిటీ అధ్యక్షులు కొండా సత్యనారాయణ రాజు, యువనాయకులు ఈతకోట రాజేష్, మల్లవరపు ఏడుకొండలు, దంగేటి శ్రీరామ్, కరాటం ప్రవీణ్, గంగుమళ్ళ ఏసుబాబు,గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments
Post a Comment