Skip to main content

ధర్మానికి ప్రతిరూపము శ్రీరాముడు పశ్చిమ బెంగాల్లో షాలిమార్ లో శ్రీరామనవమి వేడుకలు

పశ్చిమ బెంగాల్  న్యూస్  పశ్చిమబెంగాల్   హౌరా జిల్లా షాలిమార్ లో  వెలసియున్న, 106 సంవత్సరాల, సుదీర్ఘ చరిత్ర గల కొలువున్న  " శ్రీరామ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం "  శ్రీరామనవమి  వేడుకలు  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం  శుక్రవారం ఘనంగా జరిపించారు. శ్రీరామచంద్రుడు  సీతాదేవి  లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను అందంగా అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన  వేదికపై ఆసీనులను చేశారు  ఆలయ కమిటీ వైస్ చైర్మన్ " బి. తారకేశ్వరరావు, "కోశాధికారి "కే. తారకేశ్వరరావు"

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారాముల  వారి కళ్యాణ మహోత్సవమును అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ నేతృత్వంలో"  ప్రధాన అర్చకులు  జగదీష్ శాస్త్రి ,ఆధ్వర్యంలో  భక్తులకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు పుష్ప సోయగం, రంగవల్లికల మేళవింపు నడుమ తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, గౌరీ పూజ, యజ్ఞోపవీత ధారణ, తదుపరి పూజల తర్వాత నిరాజన మంత్రపుష్పం, మాంగల్య ధారణ గావించారు రామనామామృత గానంతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ 

ధర్మం, న్యాయం, నిజాయితీ, కరుణ, వంటి విశ్వ మానవ విలువలను పాటిస్తూ ఆదర్శ జీవితాన్ని గడపడానికి శ్రీరాముని జీవితం అపూర్వమైన మార్గదర్శకం. ఆయన చూపించిన సత్యం-ధర్మపదాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం, ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఇంట్లో శాంతి సౌభాగ్యాలు ఆరోగ్యం నెలకొనాలని మనస్పూర్తిగా కోరారు, అలాగే  షాలిమార్  ప్రజలపై ఆ యొక్క  శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని కోరారు.

సాయంత్రం సీతారాముల ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ.... శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.సంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిపించారు. పరిసర గ్రామవాసులు పెద్ద సంఖ్యలో హాజరై, సీతారాముల కళ్యాణం  ఆద్యంతం తిలకించి పరవశులయ్యారు. నిర్వాహకులు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది,భక్తులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Comments