Skip to main content

ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం నందు కన్నులపండుగగా సాహిత్యమహోత్సవము


ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం నందు సాహిత్యమహోత్సవము కన్నులపండుగగా జరిగింది. విభాగాధ్యక్షులు ఆచార్య సత్యనారాయణ గారు ఈ మహోత్సవంలో పాల్గొన్న విశేష అధితులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయ విద్యాలయ అనుసంధాన కళాశాలలనుండి వందకు పైగా విచ్చేసిన విద్యార్ధులకు స్వాగతం పలికారు. విద్యార్ధులు వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలలో పాల్గొని, తమప్రతిభను చూపారు. కార్యక్రమం ఆరంభంలో స్వర్గీయ ఆచార్యులకు శ్రాద్దంజలి ఘటిస్తూ, వారిమార్గదర్శకాలను స్మరించుకున్నారు. 100 సంవత్సరాల ఆంధ్రా యూనివర్సిటీ చరిత్రలో హిందీవిభాగ ఆవిర్భావము, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ విభాగము యొక్క ఔన్నత్యం, ప్రాముఖ్యతను గురించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఆచార్యులు కొనియాడారు. 


ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, విశేష అతిథిగా పాఠ్యపుస్తకసమితి అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు గారు, అతిథులుగా డాక్టర్ కృష్ణ బాబు, డా. శాంతి, డా. పి.కే. జయలక్ష్మి, డా. రాజశేఖర్ మొదలైనవారు విచ్చేశారు. హింది విభాగ ఉన్నతిలో కృషిచేసిన ఆచార్యుల మొక్కవోని కార్యదీక్షను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సన్ కళాశాల, ప్రిసం కళాశాల, బుల్లయ కళాశాల, బి.వి.కే కళాశాల, విశాఖ విమెన్స్, గాయత్రి విద్యా పరిషత్,కృష్ణ గవర్నమెంట్ కళాశాలమొదలైన కళాశాలలకు సంబంధించిన విద్యార్ధులు ,అధ్యాపకులు పాలుపంచుకున్నారు. విజేతలకు పురస్కారాలు, ప్రమాణపత్రాలు అందజేసి ఈ కార్యక్రమానికి పరిపూర్ణతను చేకూర్చారు.

Comments