Skip to main content

"వి లే క రి".

 వివేకం తో 

లేఖలను 

వార్తల

రూపంలో 

అందించ

గలవాడు 

విలేకరి.

విషయ

పరిజ్ఞానం 

అతనికే 

చెల్లు.

విలువలను 

కాలరాయని 

వాడు విలేకరి.

వార్తను వాస్తవ

రూపంలో 

విపులంగా 

యధాతధoగా 

చేర వేయగల

సమర్ధుడు 

విలేకరి.

పాత్రికేయుడు 

అని కూడా 

అంటారు.

వార్తను 

సేకరించి 

అందించడం 

ఒక కళ.

ఇది విలేకరి 

నిత్య కృత్యం.

వార్త సేకరణ,

సవరణ,

ప్రచురణ,

చేరవేత 

నాలుగు 

దశలు దాటుకుని,

ఐదవ దశలో 

పాఠకుని 

చెంతకు చేరుతుంది.

విలేకరికి 

భాష పై పట్టు,

పరిజ్ఞానం,

సమాజ స్పృహ 

అవగతం 

చేసుకునే 

సామర్ధ్యం 

కావలసిన 

అర్హతలు.

వార్త అనేది 

సంచలనం తో 

పాటు సామాజిక 

అంశం తో 

ముడిపడినది

అన్న దానికి 

ప్రాధాన్యత 

ఎక్కువ.

నేడు చాలా 

మంది నిరుద్యోగులు 

ఉపాధి అవకాశాలు 

లేక, వృత్తి పై 

మక్కువతో 

విలేకరులుగా,. చిన్న చిన్న పత్రికా 

సంపాదకులుగా 

అవతారమెత్తి 

మనకు తారస 

పడుతున్నారు.

పత్రిక నడపడమంటే 

సామాన్య 

విషయం కాదు.

దిన పత్రిక ఐతే 

అను నిత్యం 

పాటకునికి 

చేరేవరకు 

ప్రశవ వేదన

లాంటిదే.

నాకు తెలిసి 

విశాఖ లో 

ఈ రంగం లో 

ఒకరిద్దరు తప్ప 

కృతకృత్యులైన

వారు చాలా 

అరుదుగా 

కాన వస్తారు.

సేకరణ,

ప్రచురణ,

సర్క్యూలేషన్ 

ఏదీ సామాన్య 

విషయం కాదు.

దిన దిన గండం.

అన్నిటికీ మించి

ప్రకటనల సేకరణ.

ప్రకటనలు లేని 

పత్రిక ముద్రణకు 

నోచుకుని మన 

గలగడం అంత 

సులభతరం కాదు.

గత స్థితిగతులు 

వేరు, నేటి పరిస్థితులు వేరు.

నేడు అంతటా 

సాంకేతికత 

చోటు చేసుకుంది.

పత్రికల పాత్ర,

పాఠకుల కొరత 

కానవస్తోంది.

చీటికలో సెల్ 

ఫోన్ లో ప్రపంచం

అంతా సిద్ధం.

ఏది ఏమైనా 

దిన పత్రిక,

దినపత్రికే.

దాని విలువ,

విలేకరుని 

విలువ ఎన్నటికీ 

వెల కట్ట లేనిది.

నేటికీ కొందరు 

దినపత్రికను 

కాఫీ తో పాటు ఆమూలాగ్రo 

తిరగ వేయనిదే 

దినం గడవదు.

నేడు చాలా మంది 

విలేకరులే 

సంపాదకులు 

కూడా.

సంపాదకుని 

సంపాదకీయం 

ఆకట్టుకుని 

ఆ పత్రిక విలువలు 

పెరుగుతాయి.

అది దిన పత్రిక 

అవ్వవచ్చు,

వార, పక్ష పత్రిక,

మాస పత్రిక 

ఏదైనా కావచ్చు.

నేడు వార,

పక్ష, మాస 

పత్రికలు 

కనుమరుగయ్యాయి

పత్రికా రంగాన్ని 

ప్రభుత్వవాలే 

ప్రోత్సహించాలి,

విలేకరులకు,

Editors,

Subeditors కి 

కనీస 

వేతన అంటే 

Pay scales 

అమలు చెయ్యాలి.

విద్య, వైద్యం, వసతి సదుపాయాలు 

వారి సంతతికి 

అందచేయ్యాలి.

రాజకీయ పార్టీలు 

చొరవ తీసుకోవాలి.

ఎన్నికలు జరిగి 

నప్పుడు పాత్రి 

కేయుని పాత్ర 

విశేషమైనది.


                   Dr. నండూరి రామకృష్ణ

                                 09.04.202

Comments