Skip to main content

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరుశురామరాజు గారి అధ్యక్షతన, బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విశాఖ ధాబా గార్డెన్స్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు లో పాల్గొన్న బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్*


ఈసందర్భంగా మాధవ్మీడియాతోమాట్లాడుతూ....సమాజ సమానత్వానికి ప్రాణం పోసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా…భారతీయ జనతా పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.


ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుతూ…అంబేద్కర్ గారు చూపిన మార్గమే దేశానికి దిక్సూచి అని అన్నారు.


సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనలోఅంబేద్కర్ గారి ఆలోచనలు శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఆయన సిద్దాంతాలను ఆచరిస్తూసమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


అంబేద్కర్ గారి ఆశయాలను సాకారం చేయడమేమా పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.”ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు మరియు బిజెపి ఫ్లోర్ లీడర్  శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారితో పాటు అధిక సంఖ్యలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.