సమానత్వమే పునాదిగా వేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.... కలెక్టరేట్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Srinivas Spl Correspondant
అమలాపురం విశాఖ సందేసం....భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమానత్వమే పునాదిగా ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని ఆయన ప్రపంచ స్థాయి మేధావిగా కుల వివక్షత నిర్మూలన, స్త్రీ సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి అనన్య సామాన్యమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్ట ర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే నేడు మనమందరం సమాన హక్కులతో జీవిస్తున్నామన్నారు.
సమాజంలో మానవ హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్నంతా అంకి తం చేసిన అంబేద్కర్ ఆదర్శాలను గుర్తుచేసుకుని నేటి యువతకు ఆయన రచనలు, సామాజిక సంస్కరణల పట్ల అవగాహన పెంపొందించి సామాజిక న్యాయం, సమానత్వ విలువల దిశగా ప్రేరణ పొందాలన్నారు. ఎస్సీ ఎస్టీలలతో పాటు ఇతర వెనుక బడిన వర్గాల పిల్లల విద్యా సాధన, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సామాజిక ‑ఆర్థిక సంరక్షణ కార్యక్రమాలు సమర్థంగా, పారదర్శకంగా అమలయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, విద్యా సంక్షేమ పథకాలు, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలు కూడా అంబేద్కర్ సామాజిక న్యాయ ఆదర్శాలకు సమన్వయంగా ఉండాలన్నారు. కోనసీమ జిల్లా అంబేద్కర్ ఆదర్శాల ఆధారంగా సమాజ నిర్మాణం దిశగా ముందుకు సాగాలన్నారు. ఆర్డీవో జి మమ్మీ మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్నంతా అంకితం చేశారన్నారు ఆయన ఆశయాలను మన నిత్య జీవితంలో ఆచరిస్తూ, నవ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ అస్పృశ్యతకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వానికి, హక్కుల రక్షణకు పోరాడి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఆదర్శాలు మనల్ని సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వైపు ముందుకు నడిపిస్తాయున్నారు.కోనసీమ జిల్లాలోని అందరూ అంబేద్కర్ ఆలోచనలను అనుసరించి
విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో ముఖ్యంగా మహిళలు, దళితులు, వెనుకబాటు వర్గాల ప్రగతికి కృషి చేయాలన్నారు. ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పిస్తూ ప్రజా స్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. . ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని ఈ జ్యోతిలక్ష్మి దేవి, ఏవో కే కాశీ విశ్వేశ్వరరావు, డి రత్నకుమార్, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



Comments
Post a Comment