Skip to main content

గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా అధ్యక్షులు - కె. కె. రాజు

మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పై ఈ రోజు గంటా శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు పూర్తిగా ఖండనీయమని,

విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కె కె రాజు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయంగా, ఆర్థికంగా  ఎదగడానికి విశాఖ ప్రజల మద్దతు తీసుకున్న గంట శ్రీనివాసరావు , అదే విశాఖను రాజధానిగా సమర్థించకుండా అమరావతి వైపు మొగ్గు చూపడం ప్రజల విశ్వాసానికి చేసిన మోసం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు 

ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాదు…

కేవలం నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్  మెప్పు కోసం, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన వ్యాఖ్యలు మాత్రమే అని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారుఅని అన్నారు 

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నాటి ముఖ్య మంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి  విశాఖ ను రాజధానిగా ప్రకటించినప్పుడు కనీస మద్దతు తెల్పకుండా గతంలో మౌనం వహించిన గంట శ్రీనివాసరావు 

ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించగానే హర్షం వ్యక్తం చేయడం ఆయన రాజకీయ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.

ప్రజాధనాన్ని కాపాడాలని, రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలని భావించిన దూరదృష్టి నాయకుడు జగన్  అని అన్నారు 

అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడం అంటే…

ప్రజల అభివృద్ధి ఆశయాలపై దాడి చేయడమే.

గంట శ్రీనివాసరావు  వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పాలని

కె. కె రాజు గారు గట్టిగా డిమాండ్ చేశారు.

Comments