Skip to main content

*రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట ఏర్పాట్లు* *అధికారుల‌ను ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్


 విశాఖ‌ప‌ట్ట‌ణం, ఏప్రిల్ 16 ః ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాలని, కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 17, 18వ తేదీల్లో విశాఖ‌ప‌ట్ట‌ణంలో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ధీర‌జ్ సింగ్ ఠాకూర్ ప‌ర్య‌ట‌న ఉన్న‌ నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో గురువారం స‌మీక్షించారు. అధికారులంద‌రూ స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, ఎక్క‌డా ఎలాంటి లోపాలు త‌లెత్త‌కుండా, అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. 17వ తేదీ రాత్రికి ఆయ‌న విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకొని, 18వ తేదీ ఉద‌యం నుంచి విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని ఆ మేర‌కు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎండాడ ప‌రిధి రుషికొండ ఇస్కాన్ టెంపుల్ వెనుక భాగంలో నిర్మించ‌త‌ల‌పెట్టిన జ్యూడీషియ‌ల్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఆయ‌న చేతుల మీదుగా జ‌రుగుతుంద‌ని, దీని నిర్వ‌హ‌ణ‌లో జిల్లా అధికారులు, న్యాయ శాఖ‌ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని చెప్పారు. ప్రోటోకాల్, భ‌ద్ర‌త‌, బందోబ‌స్తు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, వ‌స‌తి ఇత‌ర ఏర్పాట్ల‌లో లోపాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌కు సూచించారు. ఫ‌స్ట్ ఏడీజే ఎం. వెంక‌ట ర‌మ‌ణ‌, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

                  K.V.SHARMA EDITOR 


Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.