Skip to main content

అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరణ..

 


అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలంలోని  తాడికోన, సామంతకుర్రు,ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలలో  అంగన్వాడి సహాయకుల ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తనట్లు ఐసిడిఎస్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసారు.స్తానికులైన వివాహిత స్త్రీలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తుకోవాలని, ఈ దరఖాస్తులను 22-04-2026 నుండి 04-05-2026 సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తులను అమలాపురం శిశు అభివృద్ధి పధక అధికారి  కార్యాలయంలో నిర్ణీత గడువులోగా అందజేయాలని, తరువాత వచ్చే ధరఖాస్తులని స్వీకరించమని, పూర్తి వివరాలను అమలాపురం ఐసిడిఎస్ కార్యాలయంలోను ,మండల తహసీల్దార్ కార్యాలయంలోను, గ్రామ పంచాయతీ కార్యాలయాలలోను నోటీసు బోర్డులలో ఉంచామని,అమలాపురం శిశు అభివృద్ధి పధక అధికారిణి రమాదేవి తెలిపారు.

               Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.