Skip to main content

అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి : వైసీపీ నాయకులు రమణారావు, భరత్ భూషణ్

                 Srinivas Spl Correspondant 


ఎస్సి ,ఎస్టీ ,బీసీ ,ఓ సి , మైనారిటీ, మహిళా సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘల అధ్వర్యంలో135వ డా. బిఆర్  అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం    అంబరాన్నాంటాయి. 


డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా  అమలాపురం నియోజకవర్గంలోని పేరూరు వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో  అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కుడుపూడి భరత్ భూషణ్ ముఖ్యతిదులుగా పాల్గొన్నారు.డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి పినిపే జయరాజ్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు,పరమట రాజేష్, వార్డు ప్రధాన కార్యదర్శి ముత్తాబత్తుల గణేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.