*శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు*
జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ,పద్మజ దంపతులు శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని , అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అంతరాలయంలో చీర, సారే, పసుపు , కుంకుమ తో పాటు సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రాజ్ గోపాల్ రెడ్డి గారు అమ్మవారి చిత్ర పటాన్ని ,ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అమ్మవారి మహిమ తో అనుకున్న కోరికలు నెరవేరుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.


Comments
Post a Comment