ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఏప్రియల్ 05ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఆదివారం ఉదయం ఏయూ పూర్వ ఉపకులపతి, భారత పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు, పిఎంఓకు అకడమిక్ అడ్వైజర్, సుదీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన తాతగారు ఉపకులపతిగా సేవలందించి, శతాబ్ధి ఉత్సవాలను జరుపుకుంటున్న ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించడం తనకు లభించిన గౌరవంగా తాను భావిస్తున్నానన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన తాతగారు సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో తనకున్న అనుభవాలను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్న విధానం, ఈ నెల 26న వందో ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నామని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ వివరించారు. ఈ కార్యక్రమానికి కుటుంబంతో కలిసి రావాలని డాక్టర్ సుబ్రహ్మణ్యంను ఆహ్వానించారు. వర్సిటీ తరపున సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం, డీన్ ఆచార్య కె.రమాసుధ, ఆచార్య ఎం.వి జగన్నాధ రావు, దాడి విద్యాస్థంస్థల చైర్మన్ దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment