Skip to main content

స్నేహ సంధ్య ఆధ్వర్యంలో గో సేవ, నారాయణ సేవ.... అక్షయ తృతీయ సందర్భంగా,


స్నేహ సంధ్యా సభ్యులు  సత్యవంతరావు దంపతులు, ఆదిభట్ల రామకృష్ణ , రావు  వివేకానంద ఆశ్రమమునందు గో సేవ , నారాయణ సేవను నిర్వహించారు. గో సేవలో భాగంగా గోవులకు తవుడు, చిట్టును అందించి గోమాతకు పూజలు నిర్వహించి, ఆశ్రమ వాసులకు బియ్యం ,పప్పులు, ఆయిల్ మొదలైన నిత్యవసర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా స్నేహ సంధ్య సంస్థ నారాయణ సేవ, పలు సేవా కార్యక్రమాలను వివేకానంద ఆశ్రమం లోనే, అనేక సందర్భాల్లో నిర్వహించడం జరుగుతుందని, అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కూడా సేవ కార్యక్రమాలు వివేకానంద ఆశ్రమంలో నిర్వహించడం, మాకు చాలా ఆనందంగా ఉందని, ఎందుకంటే వివేకానంద సంస్థ వారు నిత్య అన్నదానాలతో అన్నార్తుల  ఆకలి తీరుస్తున్నారని, ఈ సేవలలో మాకు భాగస్వామ్యం కల్పించినందుకు సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, స్నేహ సంధ్య సభ్యులు పాల్గొన్నారు.

                  K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.