Skip to main content

అమరావతి చట్టబద్ధతపై టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా ఆధ్వర్యంలో గాజువాకలో భారీ బైక్ ర్యాలీ*

విశాఖపట్నం, ఏప్రిల్ 04:* రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో గాజువాక జంక్షన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని “జై అమరావతి” నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు  మాట్లాడుతూ... అమరావతికి చట్టబద్ధత లభించడం ఐదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన చారిత్రాత్మక గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  అచంచల సంకల్పం, దూరదృష్టి నాయకత్వంతోనే అమరావతి శాశ్వత రాజధానిగా స్థిరపడిందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ప్రజల ఆకాంక్షలను గౌరవించిన నాయకుడు చంద్రబాబు గారేనని కొనియాడారు.

ప్రధాని  నరేంద్ర  మోదీ  తీసుకున్న నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం చూపిన సహకారం వల్లే అమరావతికి చట్టబద్ధత లభించిందని, డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్  మద్దతు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా నిలిచిందని తెలిపారు. కూటమి ఐక్యతతో సాధించిన చారిత్రాత్మక విజయమిదని పల్లా  పేర్కొన్నారు.

గత వైసీపీ పాలనపై తీవ్రంగా విమర్శిస్తూ, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిన జగన్ రెడ్డి ఇప్పటికీ మారలేదని పల్లా  మండిపడ్డారు. “మావిగన్” అంటూ మళ్లీ కొత్త డ్రామాలకు తెరలేపుతూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో మోసపూరిత రాజకీయాలు ఇక ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.

అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాకుండా, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని పల్లా గారు పేర్కొన్నారు. రైతుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాలిక పోరాటం ఫలితంగా ఈ రోజు సాధ్యమైందని తెలిపారు. ఇప్పుడు అమరావతి దేశంలోనే అగ్రగామి రాజధానిగా, ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ భారీ బైక్ ర్యాలీ ద్వారా గాజువాక ప్రజలు అమరావతిపై తమ నమ్మకాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నాయకత్వంపై ఉన్న విశ్వాసాన్ని ఘనంగా వ్యక్తం చేశారని పల్లా శ్రీనివాసరావు  తెలిపారు.

Comments