హారి మనోవికాస కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.... రక్తదానం చేసిన ఆకుమర్తి రమేష్..
అమలాపురం, విశాఖ సందేసం. అంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అమలాపురం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ ఆకుమర్తి రమేష్ మాదిగ అధ్యక్షతన కొంకపల్లి హరి మనో వికాస స్కూల్ నందు వికలాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సవరపు బైరవమూర్తి, ఉప్పలగుప్తం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు సత్తాల దుర్గారావు, అంబాజీపేట మండలం
ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు, తొత్తరముడి గోవింద్, నూటికుర్తి మూర్తి, నాయకులు పాల్గొన్నారు. స్థానిక కూటమి శాసన సభ్యులు అయితాబత్తుల అనందరావు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆకుమర్తి రమేష్ పాల్గొని రక్తదానం చేశారు.
మాదిగలకు ఏబీసీడీ రిజర్వేషన్ చేసినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు ఎల్లవేళలా ప్రజా జీవితంలో మంచి సుపరిపాలనదక్షులుగా ఉండాలని ఆకుమర్తి రమేష్ అన్నారు. మాదిగలు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడుకి పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ సారద్యంలో కృతజ్ఞతగా ఉంటామని సవరపు బైరవ మూర్తి అన్నారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment