మల్కిపురం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కామానగరువు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై మల్కిపురం మండలం డిప్యూటీ ఎంపీడీఓగా ఆర్ఎస్ఎస్ సురప రాజు బాధ్యతలను మల్కిపురం మండల అభివృద్ధి కార్యాలయంలో అధికారులు, సహా ఉద్యోగుల సమక్షంలో స్వీకరించారు.
బాధ్యతలను స్వీకరించిన సూరప రాజుకు డి ఎల్ పి ఓ బొజ్జరాజు, రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి అడబాల ఎస్. ఎస్. రాజా, బి. ఆదినారాయణ, శ్రీనివాస్, గుత్తుల వాసు, కార్యాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలను అందజేసి దూస్సాలువాలను కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు.


Comments
Post a Comment