పర్యాటకానికి సరికొత్త చిరునామాగా త్రిశూల్ * నిర్మాణ పనులను పరిశీలించిన వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్
విశాఖ పర్యాటకానికి సరికొత్త చిరునామాగా కైలాసగిరి పై నూతనంగా నిర్మించిన త్రిశూల్ ప్రాజెక్ట్ మారనుందని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ అన్నారు. బుధవారం సాయంత్రం కైలాసగిరి పై నిర్మాణంలో ఉన్న త్రిశూల్ పనులను ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు.
సుమారు 65 అడుగుల ఎత్తున డమరుకం తో కూడిన త్రిశూల్ పరిసరాలు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. త్రిశూలం సమీపంలో డెకరేటెడ్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చెయ్యాలని సూచించారు.
నిరంతరం త్రిశూల్ పరిసరాలు ఆధ్యాత్మికత వాతావరణం ఉట్టిపడేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఓంకార నాదం వినిపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. సందర్శకులు సేదతీరే విధంగా బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే వారంలో త్రిశూల్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
త్రిశూల్ ప్రాజెక్టు గురించి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ప్రధాన ఇంజినీర్ శ్రీ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజినీర్ శ్రీ భవాని శంకర్, కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీ JCP సింగ్, డి ఎఫ్ ఓ శ్రీమతి శిరీష తదితరులు పాల్గొన్నారు
K.V.SHARMA EDITOR




Comments
Post a Comment