Skip to main content

*వైశాఖమాస ప్రారంభం*


వైశాఖమాసం తెలుగు నెలల్లో రెండోది. వసంతశోభ వెల్లివిరిసే సమయమిది. ఇదే తరుణంలో ఎండలు ముదురుతుంటాయి. అందుకే వైశాఖం పచ్చిందంటే మనవారు కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. మండువేసవిలో మంచినీళ్లు దానం చేయడం. కంటే గొప్పది లేదంటారు. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లివ్వడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడమే అన్నింటికంటే గొప్ప ధర్మాలు. అవే మనం సంపాదించుకోదగిన అసలైన పుణ్యాలు. ఆ బాటలో నడవాలి. మనం చేసుకునే పుణ్యకార్యక్రమాలకు లక్ష్మీదేవి స్వయంగా అక్షయ ఫలాలను అనుగ్రహించే మహత్తర పర్వదినం అక్షయ తృతీయ. ఆరోజు మహాలక్ష్మీపూజ నిర్వహిస్తారు. పొదుపుకి, మదుపుకి అనుకూలంగా ఆనాడు కొద్దిగానైనా బంగారాన్ని కొనుక్కోమని పెద్దలు చెబుతుంటారు. 

ఆరోజునే సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనపు పూతలోనే దర్శనమిచ్చే ఆ స్వామి నిజరూపాన్ని చూడగలిగే ఒకే ఒక్కరోజు అక్షయ తృతీయ. 

బదరీ నారాయణుడు, కేదారనాథుడు తమ దర్శనాలను అనుగ్రహించే శుభతరుణం కూడా ఇదే. పరశురాముడు, ఆదిశంకరుడు మొదలు ఎందరెందరో విశ్వగురువులు తెలుగు నెలల ప్రకారం వైశాఖంలోనూ. ఇంగ్లీషు నెలల ప్రకారం మే మాసంలోనే పుట్టడం యాదృచ్ఛికం. గౌతమబుద్ధుడు, రామానుజులు, వీరబ్రహ్మేంద్రస్వామి, బసవేశ్వరుడు వంటి గురువులు ఈమాసంలోనే పుట్టారు. దైవాలు సైతం ఈమాసంలోనే పుట్టారు. శుక్లపక్షం చివరిలో నృసింహ జయంతి నాడు, బహుళపక్షంలో హనుమజ్జయంతి నాడు వస్తాయి. నృసింహజయంతి సందర్భంగా ఆలయాలన్నింటిలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. 

వైశాఖానికి మాధవమాసమని పేరున్న కారణంగా అనేక వైష్ణవాలయాల్లో కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం కూడా ఈ మాసంలోనే జరగనుంది. అదే కాకుండా తెలుగునాట అనేక జాతరలు కూడా జరగబోతున్నాయి. ఆ దేవీ దేవతలందరూ మనందరినీ చల్లగా చూడాలని, అందరికీ క్షేమం కలగాలని కోరుకుందాం

             K.V.SHARMA  EDITOR 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.