*▪️రెండు దశాబ్దాల తర్వాత యారాడలో ఐదు శాఖల సంయుక్త పరిశీలన… జెట్టి నిర్మాణానికి మళ్లీ ఊపిరి* *▪️ మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*
విశాఖపట్నం, ఏప్రిల్ 06:* యారాడ తీరప్రాంతంలో ప్రతిపాదిత ఫిషింగ్ జెట్టి, బ్రేక్‌వాటర్ల నిర్మాణంపై బహుళ శాఖల సంయుక్త పరిశీలన ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో ఐదు శాఖలు సమన్వయంతో నిర్వహించిన ఈ పరిశీలన మత్స్యకారుల అభ్యున్నతికి కీలక మలుపుగా మారుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు.యారాడ వద్ద గంగవరం, దిబ్బపాలెం ప్రాంతాల మత్స్యకారులకు ఫిషింగ్ జెట్టీ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టిన సందర్భంగా, స్థానిక మత్స్యకారుల అవసరాలు, బోట్ల సంఖ్య, జీవనోపాధి పరిస్థితులపై పల్లా శ్రీనివాసరావు గారు ప్రత్యక్షంగా ఆరా తీశారు. ఈ సంయుక్త పరిశీలనలో ఆంధ్రప్రదేశ్ సముద్ర మండలి ప్రధాన ఇంజినీర్ పద్మశ్రీ, మండలి సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, విశాఖ పోర్ట్ ఆధారిటీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, గంగవరం పోర్టు జనరల్ మేనేజర్ బాపూజీ, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, గంగవరం, దిబ్బపాలెం మత్స్యకార ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యారాడలో ఫిషింగ్ జెట్టి, బ్రేక్‌వాటర్ల నిర్మాణం మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేసే కీలక మౌలిక సదుపాయమని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంతో పాటు భద్రతను పెంచడంలో ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే సంబంధిత అధికారులు తక్షణమే సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించి, వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు అమలులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం తీరప్రాంత అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం పట్ల కట్టుబడి పనిచేస్తోందని పల్లా గారు పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను పునరుద్ధరించి, శాఖల సమన్వయంతో వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బహుళ శాఖల సమిష్టి కృషితో అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపు వస్తోందని అన్నారు.యారాడ ప్రాంతాన్ని మత్స్యకార రంగంలో అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.





Comments
Post a Comment