Skip to main content

పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఎన్నికలు

                             కె. వి. శర్మ, ఎడిటర్,


 ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు మంగళవారం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం స్వామి వివేకానంద స్కూల్ ఆవరణలోని  అసోసియేషన్ ఆఫీసులో పారదర్శకంగా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి నాయకులు హాజరై అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ గా నెల్లూరు జిల్లా నుండి సీనియర్ నాయకుడు అన్వర్ భాష  ను,రాష్ట్ర  అధ్యక్షునిగా ప్రకాశం జిల్లా నుండి పార్వత రెడ్డి కిషోర్ బాబును , ప్రధాన కార్యదర్శిగా


 విశాఖ నుంచి ప్రకాశం విద్యానిలయం కరస్పాండెంట్ బివి మురళి మనోహర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదనపు ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా నుండి ఏ గోపాల్ రెడ్డి, కోశాధికారిగా తూర్పుగోదావరి జిల్లా నుండి మల్లాడి రాజు, గౌరవ అధ్యక్షురాలిగా కాకినాడ జిల్లా నుండి పి వసంత, సహాయ కార్యదర్శిగా ఉత్తరాంధ్ర నుంచి సి హెచ్ వి ఆర్ మూర్తి , ఉత్తరాంధ్ర రీజియన్ అధ్యక్షునిగా జి ఎస్ నాయుడు లను ఎన్నుకున్నారు. అదే విధంగా ప్రతి జిల్లా నుండి ఒక్కొక్కరిని ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శులుగా 


 ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర చైర్మన్ గా ఎన్నికైన అన్వర్ భాషా మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల నుండి ప్రైవేట్ బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ దివంగత కేఎస్ఎన్ మూర్తి సారధ్యంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొందన్నారు. ఆయన లేని లోటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆశయ సాధనకు నూతన కార్యవర్గం కృషి చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బివి మురళీ మనోహర్ మాట్లాడుతూ గడిచిన 30 సంవత్సరాల్లో తమ అసోసియేషన్ ఎన్నో ప్రైవేట్ విద్యాసంస్థలను నిలబెట్టిన ఘనత సంపాదించుకుందని నూతన కార్యవర్గం కూడా అసోసియేషన్ అభివృద్ధికి కట్టుబడి, సీనియర్ల సూచనలతో ముందుకు నడుస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన  రాష్ట్ర అధ్యక్షుడు పార్వత రెడ్డి కిషోర్ బాబు మాట్లాడుతూ తాను గతంలో అసోసియేషన్ లో సుదీర్ఘ కాలం రాష్ట్ర కోశాధికారిగా, జిల్లా అధ్యక్షునిగా దివంగత కేఎస్ఎన్ తో  కలిసి పనిచేసే అదృష్టం  కలిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సభ్యులందరూ తనపై  నమ్మకముంచి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.తనపై  ఉంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు.


 సభ్యులందరూ సహకరించాలని కోరారు. విశాఖ జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు కొణతాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎం సూరిబాబు, కోశాధికారి శాంతినికేతన్ శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, పలువురు జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్రస్థాయి నాయకులు,రాష్ట్రం నలుమూలల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.