Skip to main content

బిసిల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం : ఎమ్మెల్యే ఆనందరావు..... కూటమి ప్రభుత్వం వెన్నంటే బిసిలు డి.సి.ఎమ్ఎస్. చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి...

 

అమలాపురం, విశాఖ సందేసం....శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం 

అధికారిక జయంతిగా ప్రకటించిన నేపథ్యంలో డిసి ఎమ్ ఎస్. చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో కూటమి నేతల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం 

అధికారిక జయంతిగా ప్రకటించిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పేరూరులో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కూటమి నేతల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డిసి ఎమ్ ఎస్. చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో మంగళవారం పేరూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆనందరావు వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ శెట్టిబలిజల జాతి ఉన్నతికోసం అహర్నిశలు శ్రమించి జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డిని అన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి అమలాపురం మండలం బోడసకుర్రులో జన్మించారని పేర్కొన్నారు. .శెట్టిబలిజ జాతి పితామహుడిగా పేరూపొందిన వెంకటరెడ్డి జయంతి రోజైన మార్చ్ 23 ను కూటమి ప్రభుత్వం అధికారిక జయంతి గా ప్రకటించి బిసి ల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుందని వెల్లడించారు. డిసి ఎమ్ ఎస్ చైర్మన్ చంద్రమౌళి మాట్లాడుతూ బోడసకుర్రులోని వారధికి ప్రభుత్వం దొమ్మేటి వెంకటరెడ్డి పేరు పెట్టి ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సామాజిక భవనాన్ని కూడా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ముఖ్య అతిధితో కలిసి కూటమి నేతల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా థాంక్ యూ చంద్రబాబు, థాంక్ యూ కూటమి ప్రభుత్వం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెచ్చెట్టి విజయలక్ష్మి, వాసంశెట్టి చినబాబు, పలివెల శ్రీనివాస్, కెవి, చొల్లంగి సాయిబాబు, దంగేటి విజయగౌరి శ్రీనివాస్, దొంగ శ్రీను చొల్లంగి అప్పాజీ, అధిక సంఖ్యలో కూటమి నేతలు, శెట్టిబలిజ సామాజిక వర్గీయులు పాల్గొన్నారు

Comments