Skip to main content

హిందీ అనువాద గ్రంథం “ఆఖిర్ కబ్ తక్?” ఆవిష్కరణ

విశాఖపట్నం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏప్రిల్ 4వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు

వి.సా. 1971 మరియు హిందీ సాహిత్య భారతి సంయుక్త ఆధ్వర్యంలో

హిందీ అనువాద గ్రంథం “ఆఖిర్ కబ్ తక్?” ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది।

సహృదయ సాహితి అధ్యక్షులు

శేఖరమంత్రి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి

ముఖ్య అతిథిగా కళారత్న పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్తడా. దామెర వెంకట సూర్యారావు గారు విచ్చేసి,గోరంత దీపం” పేరుతో 1970 దశకంలో శ్రీ మల్లాప్రగడ రామారావు గారు రచించిన తెలుగు కథాసంపుటికి , సెయింట్ జోసెఫ్ కళాశాల PRO, పూర్వ హిందీ ఆచార్యులు,  డా. పి. కె. జయలక్ష్మి చేసిన హిందీ అనువాదం 

“ఆఖిర్ కబ్ తక్?” ను ఆవిష్కరించి,

కథలను పరిచయం చేశారు.

మూల రచయిత శ్రీ మల్లాప్రగడ రామారావు గోరంత దీపంలో తమ కథల నేపథ్యాన్ని వివరించారు.

శేఖరమంత్రి ప్రభాకర్ రావు  అధ్యక్షోపన్యాసంలో

అనువాద సాహిత్యాల అవసరాన్ని వివరించారు.

హిందీ సాహిత్య భారతి గౌరవాధ్యక్షులు డా. ఎస్. కృష్ణ బాబు 

గ్రంథంపై సమీక్షాత్మకంగా మాట్లాడుతూ, అనువాద కృతి విశిష్టతను వివరించారు.

ఈ సందర్భంగా డా. పి. కె. జయలక్ష్మి అనువాద శైలి సరళంగా, సునిశితంగా ఉండి,

సహజత్వంతో పాటు భావ గాంభీర్యాన్ని కాపాడుతూ,

తెలుగు మూలానికి న్యాయం చేసే విధంగా హిందీలో అందంగా ప్రతిఫలించిందని అభినందించారు.

అనంతరం రచయిత్రి డా. పి. కె. జయలక్ష్మి తన స్పందనలో,

మూల రచన యొక్క భావాన్ని యథాతథంగా ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు పేర్కొంటూ,

ఈ కృతి హిందీ పాఠకులకు చేరువ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు.

శ్రీ ఘండికోట విశ్వనాథం వందన సమర్పణ చేసారు.కార్యక్రమంలో డా. రాజశేఖర్, రాధారాణి, గణేశ్వర రావు,పృథ్వీలాతో పాటు సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు , సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

Comments