39 వ వార్డు, దక్షిణ నియోజకవర్గంలో శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.C.M.A. జహీర్ అహ్మద్ గారు, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన తో పాటు, మహిలోద్ధరణకు కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త. బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిన గొప్ప సంఘసంస్కర్త అని , ఇలాంటి సంఘసంస్కర్తల జీవిత చరిత్రలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత విద్యార్థులకు ఉంది అని తెలియజేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా, రేపు శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు, కటికి సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షులు అప్పారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సభ్యులుK. ప్రసాదు, K. సతీష్ పాల్గొన్నారు

Comments
Post a Comment