తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశాఖపట్నం విశాలాక్షి నగర్ బీవీకే జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఉన్నత మార్కులతో విజయ దుందుభి మోగించారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారని గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జూనియర్ కాలేజీ కరస్పాండంట్ డాక్టర్ నండూరి రామకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ఇందిరా సంయుక్త తెలిపారు. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల, కళాశాల యాజమాన్యం అందించిన బోధనా నైపుణ్యంతో ఈ ఘన విజయం సాధ్యమైందని తెలిపారు.రెండవ సంవత్సరం ఫలితాల్లో ఎస్ కే ముష్కాన్ 936 మార్కులు,టీ మణికంఠ 924 మార్కులు,బీ సంధ్య 906 మార్కులు సాధించారని తెలిపారు.మొదటి సంవత్సరం ఫలితాల్లో జె శశి ప్రియ 471 ,ఎన్ ప్రత్యక్ష 439, ఎస్ జానీ 466 ,ఈ గణేష్ 462 ,డీ హేమలత 454,పీ ధరణ్ కుమార్ 451, బి లలిత 447,బీ రోహిణి 444, ఎస్ భాగ్య శ్రీ 413 మార్కులు సాధించినట్లు తెలిపారు.గత ఏళ్లలాగే ఈ ఏడాది కూడా తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని తెలిపారు.తమ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసి,సిఈసి,ఎంఈసి ఒకేషనల్ కోర్సుల్లో మెడికల్ లేబరేటరీ టెక్నాలజీ (ఎం ఎల్ టీ), మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎం పీ హెచ్ డబ్ల్యు),ఫిజియోథెరపీ,కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.తమ కళాశాలలో ఎన్ సి సి,ఎన్ ఎస్ ఎస్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.పేద విద్యార్థులకు పీజులో రాయితీ కూడా కల్పిస్తున్నామని,దాతల సహకారంతో స్కాలర్ షిప్ లు కూడా అందచేస్తున్నట్లు తెలిపారు. అత్యున్నత విద్యావంతులైన బోధనా సిబ్బంది తమ కళాశాలలో సేవలందిస్తున్నారని, కేవలం విద్యాబోధన కాకుండా మానసిక వికాసం, శారీరక, సామాజిక వికాసానికి మాతృభాషలో బోధన, ఆటపాటలు, కౌన్సెలింగ్ తదితర అంశాలతో విద్యార్థుల్లోని మానసిక ఒత్తిడి తగ్గించి, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తమ ఉపాధ్యాయ సిబ్బంది కృషిచేస్తారని తెలిపారు. అత్యాధునిక ఫిజిక్స్,బయోలాజి,కెమిస్ట్రీ సైన్స్ లేబరేటరీలు,కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.రోటరీ క్లబ్ సహకారంతో ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.ఆహ్లాదకర వాతావరణంలో,విశాలమైన వాలీ బాల్ కోర్ట్,బాస్కెట్ బాల్ కోర్ట్ అందుబాటులో ఉన్నాయని,సుమారు పదివేల పుస్తకాలతో గ్రంధాలయం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.ఎం సెట్ కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని,పోటీ పరీక్షలు ఎస్ ఎస్ సి,గ్రూప్స్,రైల్వే పరీక్షలకు అనుభవజ్ఞులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.రవాణా సౌకర్యం కూడా ఉన్నట్లు తెలిపారు.అత్యున్నత ప్రమాణాలతో,క్రమశిక్షణతో కొనసాగే తమ కళాశాల విశాలాక్షినగర్ బీవీకే జూనియర్ కాలేజీ లో తమ పిల్లలను చేర్చి ఉన్నత విద్యావంతులుగా,క్రమశిక్షణ గల భావిభారత పౌరులుగా తీర్చిద్దిద్దాలని తల్లి తండ్రులను కరస్పాండంట్ డాక్టర్ నండూరి రామకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ఇందిరా సంయుక్త కోరారు.
K.V.SHARMA EDITOR

Comments
Post a Comment