భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరి శుక్రవారం జల ప్రవేశం చేసింది. శుక్రవారం విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను ప్రారంభించారు.సిడిఎస్ జనరల్ అనిల్ చౌహన్, భారత నౌక దళాధిపతి దినేష్ కే త్రిపాఠి,ఈస్టర్న్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ సంజయ్ బళ్ల తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీలగిరి శ్రేణి 17 ఏ లో నాలుగవ ప్రాజెక్ట్ గా ఈ యుద్ధ నౌకను ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.స్టైల్ సాంకేతిక తో రూపొందించిన ఈ యుద్ధ నౌక భారత సముద్ర సరిహద్దు రక్షణలో కీలకపాత్ర పోషిస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి. స్వదేశీ ఆధునిక సాంకేతిక వినియోగంలో 75 శాతానిపైగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పారిశ్రామిక రక్షణ ఉత్పతుల తయారీ సంస్థలు ఈ నౌక నిర్మాణంలో భాగస్వామ్యం అయినట్టు నేవీ వర్గాలు తెలిపాయి. శత్రువుల రాడార్లకు కనిపించకుండా పనిచేసే సామర్ధ్యం ఈ నౌక ప్రత్యేకత అని, నవంబర్ 28న నేవీ కి అప్పగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పుతో 6670 టన్నుల బరువు ఉండే ఐఏఎస్ తారాగిరి డీజిల్,గ్యాస్ సాంకేతికతను ఉపయోగించి సముద్రంలో
వేగంగా దూసుకెళ్తుందని, 28 నాట్స్ వేగం సముద్రపు దొంగలు లేదా శత్రు నౌకలను ఛేదించడానికి అనువైనదని నేవీ వర్గాలు తెలిపాయి. ఇందులో నిశ్శబ్ద ఫిరంగుల ఆధునిక టెక్నాలజీ అమరి ఉందని,క్షిపణులు, అత్యాధునిక సెన్సార్లు, పవర్ ఫుల్ గన్స్‌తో కూడిన అత్యాధునిక వార్ షిప్ అని నేవీ వర్గాలు తెలిపాయి.
బరాక్ 8 వంటి విమాన విధ్వంసక, ఎనిమిది బ్రహ్మోస్ నౌక విధ్వంసక క్షిపణులు ఇందులో ఉన్నాయని,యాంటీ సబ్ మెరైన్ వార్ ఫైర్ వ్యవస్థతోపాటు శత్రువుల జాడను ముప్పును ముందే పసిగట్టే రాడార్ వ్యవస్థ ఐఎన్ఎస్ తారాగిరి లో ఉన్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి.

Comments
Post a Comment