కిమ్స్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు. అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం... నేడు స్వామి వారి గ్రామోత్సవం...
అమలాపురం, విశాఖ సందేసం....కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు జరుగుచున్న ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా రెండవ రోజు అనగా 22వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల నుండి అర్చన, లక్ష్మి హోమం, నీరాజనం మరియు మంత్రపుష్పం, తదుపరి 8 గంటలకు స్త్రీలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. సుమారు 100 మంది మహిళలలు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము అంగరంగా వైభవంగా జరిగింది. సుమారు వెయ్యి మంది భక్తులు, పలువురు రాజకీయ నాయకులు మరియు పుర ప్రముఖులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తరించారు. తదుపరి తీర్ధ ప్రసాద వితరణ జరిగింది.
మూడవ రోజు అనగా 23 వ తేదీ గురు వారం ఉదయం సుదర్శన హోమమం, పూర్ణాహుతి, చక్ర స్నానం తదితర కార్యక్రమాలు జరుగును. మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం జరుగును. సాయంత్రం 5 గంటలకు పర్యంక శయనోత్సవం, ఆశీర్వచనం, పండిత సత్కారం, నీరాజనం, మంత్రపుష్పం మరియు తీర్ధ ప్రసాద వితరణ జరుగును.
ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే అని, అమలాపురం పరిసర ప్రాంతముల భక్త మహాశయులందరూ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని, శ్రీ స్వామి వారి సేవలో తరించవలసినదిగా కిమ్స్ ఛైర్మన్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) తెలియజేసారు.
Srinivas Spl Correspondant



Comments
Post a Comment