Skip to main content

శతాబ్ది ఉత్సవాలను.. ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న‌ల‌ను విజ‌య‌వంతం చేయాలి* *సమీక్షా స‌మావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

 


విశాఖపట్నం, ఏప్రిల్ 22 ః ఈ నెల 27న జ‌రిగే ఏయూ శ‌తాబ్ది ఉత్స‌వ ముగింపు వేడుకుల‌ను, ప్ర‌ముఖుల ప‌ర్య‌ట‌న‌ల‌ను స‌మ‌ష్టి కృషి.. స‌మ‌న్వ‌యం వ‌హించి విజ‌య‌వంతం చేయాల‌ని అధికారుల‌ను జిల్లా కలెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగు హాలులో బుధ‌వారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అధికారుల‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా, లోపాల్లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీవీఐపీ, వీఐపీ ప్రోటోకాల్ అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, వేదికపై కూర్చోబోయే ప్రముఖుల జాబితాను ఖరారు చేయాలని, ప్రజాప్రతినిధుల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉప రాష్ట్రపతి హాజరు విషయమై నిర్ధారణ వచ్చిన వెంటనే గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాట్లు చేయాల్సి ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి రాక కోసం కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌ను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. వీవీఐపీలకు లైజన్ అధికారులను నియమించి, సమన్వయం కల్పించాలని సూచించారు. 


కార్యక్రమంలో కాఫీ టేబుల్ బుక్ విడుదల, ఎంఓయూల సంతకాలు, ప్రముఖుల సన్మాన కార్యక్రమాలను ప్ర‌ణాళికాయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేదిక అందంగా తీర్చిదిద్దడం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, గ్రీన్ రూములు, లాంజ్ గదులు ఏర్పాటు, గ్యాలరీలకు సూచిక బోర్డులు ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పార్కింగ్, తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలను సమయానికి అందుబాటులో ఉంచాలని, మధ్యాహ్నం 2 గంటలలోపు విద్యార్థులంతా వ‌చ్చి కూర్చునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అతిథుల స్వాగతం, ఇత‌ర ప్రొటోకాల్ అంశాల్లో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు.


పార్కింగ్ ప్రాంతంలో లైటింగ్, ఎల్.ఈ.డి. స్క్రీన్లు, ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో త‌ల్లిదండ్రులు, సాధార‌ణ పౌరుల కోసం ప్ర‌త్యేక ఎల్.ఈ.డి.లు పెట్టాల‌ని, ప్ర‌ధాన కార్య‌క్ర‌మాన్ని ఆన్లైన్ ద్వారా ప్ర‌సారం చేయాల‌ని చెప్పారు. ఎయిర్ పోర్టులో రిసెప్షన్ డెస్క్ పెట్టాల‌ని సూచించారు. శానిటేషన్, పార్కింగ్ జోన్లు, హెలిప్యాడ్, వేదిక‌ రెండు వైపులా మెడికల్ క్యాంపులు, ఏఎల్ఎస్ అంబులెన్స్, విద్యుత్ సరఫరాలో అంత‌రాయం లేకుండా జ‌న‌రేట‌ర్లు, ఫైర్ సేఫ్టీ దృష్ట్యా అగ్నిమాప‌క వాహ‌నాల‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తగిన వసతి సౌకర్యాలు కల్పిస్తూ, ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

జాయింట్ క‌లెక్ట‌ర్ గొబ్బిళ్ల విద్యాధ‌రి, డీసీపీ విజ‌య్ మ‌ణికంఠ‌, ఇన్ఛార్జి డీఆర్వో టి. గోవిందు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

                   K.V.SHARMA EDITOR 


Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.