Skip to main content

పత్రికా ప్రకటన జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,

 


విశాఖపట్నం, తేది. 09.04.2026 :ఈరోజు అనగా తేదీ 09.04.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు 1 టౌన్, ప్రసాద్ గార్డెన్స్, అల్లిపురం పట్టణ ఆరోగ్య కేంద్రములను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓపి సేవలు, అభ ఐడి రిజిస్ట్రేషన్, ANM సేవల గురించి సమీక్ష చేశారు.

 PMSMA, గర్భిణీ స్త్రీ సేవలు, NCD 4.O స్క్రీనింగ్, సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండాలని మరియు EHR, IHIP, RCH కూడా నమోదు చేయాలని సిబ్బందికి తెలియచేసారు. ఆరోగ్య కేంద్రములని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. సిబ్బంది అందరూ FRS హాజరు విదిగా వేయాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బంది ఎవరైనా క్షేత్ర సందర్శనకు వెళ్ళేటప్పుడు విధిగా మూవ్మెంట్ రిజిస్టర్ లో


నమోదు చేయాలని లేని పక్షంలో తగిన చర్యలు గైకొనబడతాయని మరియు సూపర్వైజర్స్ తమ సందర్శనలను సంబందిత ఏ.ఎన్.ఎంలతో హై రిస్క్ గర్భిణీ లను గుర్తించి డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లి చికిత్స అందించవలెనని మరియు సంబందిత ఏ.ఎన్.ఎంల ద్వారా అభ ఐ.డి, ఎన్.సి.డి.4.0, ఆర్.సి.హెచ్. ఇండికేటర్స్ అప్డేట్ చేయించాలని ఆదేశించారు మరియు వైద్యులకు, సూపర్వైజర్స్ విధిగా తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.  

ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.  

         జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                        విశాఖపట్నం



    

Comments