Skip to main content

ఓడలరేవు తీర ప్రాంత కోతను అరికట్టేందుకు చర్యలు : జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఓఎన్జిసి సహకారంతో గ్రోయిన్స్, తోటల పెంపకానికి సన్నాహాలు...


అమలాపురం, విశాఖ సందేసం....అల్లవరం మండలం ఓడలరేవు  తీరప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని. తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి గ్రోయిన్స్, తోటల పెంపకానికి ఓఎన్జిసి సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం ఓఎన్జిసి, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రత్యామ్నాయ భూమి సేకరణ భూ పరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్  మాట్లాడుతూ ఓఎన్జిసి కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న ఓడలరేవు సముద్ర తీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ తీర ప్రాంతంలో సుమారు 10.5 ఎకరాలు భూమిని సేకరించడం జరిగిందని దీనికి ప్రత్యామ్నాయంగా ఓ ఎన్ జి సి సంస్థ  అందుబాటులో ఉన్నటువంటి వేరే భూమిని కొనుగోలు చేసి అప్పగించాలన్నారు. ఓడలరేవు తీరానికి అనువైన సర్వే తోటలు, మడ అడవులు అనువైనవన్నారు ఈ ప్రాంతంలో ఇసుక నేలలు ఎక్కువగా ఉంటాయని అందువలన  మొక్కలు ఏపుగా పెరుగుతాయన్నారు. సర్వే తోటలు ఇవి గాలి వేగాన్ని తగ్గించి, ఇసుక కోతను ఆపడంలో కీలకంగా ఉంటాయని వీటిని వరుసలుగా నాటడం వల్ల ఉప్పు గాలుల నుండి లోపలి పంట పొలాలను కాపాడుకోవచ్చునన్నారు. మడ అడవులు ఓడలరేవు దగ్గర కాలువలు లేదా బ్యాక్ వాటర్స్  ఉన్న చోట మడ మొక్కలు నాటితే భూమి కోతకు గురి కాకుండా ఉంటుందన్నారు. 


అటవీ శాఖ, సామాజిక అటవీ విభాగం అధికారులు  తీరప్రాంత పెంపకం కోసం ఉచితంగా మొక్కలు అందించడమే కాకుండా సాంకేతిక సలహాలు కూడా ఇవ్వాలన్నారు. ఉప్పాడ వంటి ప్రాంతాల్లో సముద్రం చొచ్చుకు రావడం వల్ల ఇప్పటికే చాలా భూమి కోల్పోవడం జరిగిందన్నారు. ఓడలరేవు నందు ఇప్పుడు తోటలు పెంచడం అనేది కేవలం పర్యావరణం కోసమే కాకుండా, గ్రామాన్ని రక్షించుకోవడానికి అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి ఎన్ వి ప్రసాదరావు, ఓ ఎన్ జి సి ప్రతినిధులు భూసేకరణ సెక్షన్ సూపరింటెండెంట్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments