Skip to main content

అమలాపురం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కాశి శేషారావు...


 అమలాపురం, విశాఖ సందేసం...బార్ అసోసియేషన్ ఆఫ్ అమలాపురం నూతన అధ్యక్షులుగా కాశి శేషారావు ఎంపికైనట్లు బార్ అసోసియేషన్ ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కటికదల సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు నూతన కమిటీ ప్రమాణస్వీకారం గురువారం స్థానిక బార్ అసోసియేషన్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు అందరితోనూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. 


నూతన కార్యవర్గం:-ప్రధాన కార్యదర్శి నల్లా సురేష్ కుమార్,కార్యదర్శి డి.వి.వి.ఎస్.మూర్తి, గ్రంథాలయ కార్యదర్శి జల్లి శ్రీనివాసరావు, కోశాధికారి రాపాక దేవ దీవెన,సీనియర్ కార్య నిర్వాహక సభ్యులు ఎం.డి.ఆజం,కుడిపూడి అశోక్, సి.వి.సూర్యనారాయణ,అబ్బిరెడ్డి సురేష్ ,కె.శశిధర శ్రీరామ్,బడుగు భాస్కర్ జోగేష్ ,దాసరి అప్పలస్వామి, దాసరి శ్రీలత, గుత్తుల విజయశ్రీ ఎంపికైనట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను పలువురు న్యాయవాదులు అభినందించారు.

           Srinivas Spl Correspondant 

Comments

Popular posts from this blog

ప్రాణాలను కాపాడే సేవలో ఉక్కు సంకల్పం – RINL , విశాఖ ఉక్కు కర్మాగారం మాజీ జనరల్ మేనేజర్(VRS) శ్రీ జేవీవీఎస్ శర్మ 39 వ సారి అరుదైన ఓ- నెగటివ్ రక్తదానం*

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య కృపతో, RINL,   విశాఖ ఉక్కు కర్మాగారం లో  థర్మల్ పవర్ ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్)గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న శ్రీ జేవీవీఎస్ శర్మ గారు మరోసారి తన సేవా భావాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్‌లో హృదయ శస్త్రచికిత్స పొందవలసిన ఒక వ్యక్తికి  అరుదైన O-నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణరక్షణలో భాగస్వాములయ్యారు. శ్రీ శర్మ గారు సేవా స్పూర్తి, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. వీఆర్‌ఎస్ అనంతరం కూడా అవసరమైన వారికి సహాయం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన చేసిన 39వ రక్తదానం కావడం విశేషం. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తున్నారు. శ్రీ సత్య సాయి సాయి కుటుంబ సభ్యులు మరియు విశాఖ ఉక్కు కర్మాగారం సహచరులు ఆయన ఈ మహత్తర సేవను అభినందిస్తూ, శ్రీ శర్మ గారు, వారి సతీమణి మరియు పిల్లలపై భగవాన్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సమాజ సేవలో మరింత ముందుకు సాగేందుకు ఆయనకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.