Skip to main content

శ్రీ సత్య సాయి సేవా సంస్థలుఆంధ్ర ప్రదేశ్ *ప్రశాంతి నిలయంలో ఏకాదశ రుద్ర పారాయణం మహోత్సవంలో పాల్గొనడానికి దివ్య ఆహ్వానం*


ప్రశాంతి నిలయం లో జరగబోయే ఆరాధన మహోత్సవం సందర్భంగా, భారతదేశంలోని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో నిర్వహించిన రుద్రోపాసనకు సమాప్తిగా, *భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో, సాయి కుల్వంత్ హాల్ లో ఏప్రిల్ 25, 2026 న జరగబోయే ఏకాదశ రుద్ర పారాయణం*   కార్యక్రమం భక్తులకు ఒక అరుదైన ఆధ్యాత్మిక అవకాశంగా నిలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాయి భక్తులందరూ ఈ మహోన్నత సేవలో పాల్గొని, స్వామి వారి అనుగ్రహ కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.

📝 నమోదు (Registration)

భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్ నమోదు సదుపాయం కల్పించబడింది:

🔗 నమోదు లింక్:

https://forms.gle/9P1yMRxqDB2Us9Rk6

*సాయి కనెక్ట్ ద్వారా ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నవారు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం లేదు*

 హాజరు వివరాలు (Reporting Details)

📅 హాజరు తేదీ: 24 ఏప్రిల్ 2026 

⏰ సమయం: ఉదయం 7:00 గంటలకు 

📍 స్థలం: ప్రశాంతి నిలయం 

*స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంటుంది*.

👉 ఆన్‌లైన్‌లో నమోదు చేసిన భక్తులు కూడా కౌంటర్ల వద్ద హాజరు నిర్ధారించుకుని బ్యాడ్జ్ పొందాలి.

🏷️ బ్యాడ్జ్‌లు (Badges)

“చాంటర్” బ్యాడ్జ్ – రాష్ట్ర వేదం ఇన్‌చార్జ్‌ల ద్వారా గుర్తింపు పొందిన వారికి మాత్రమే 

“పార్టిసిపెంట్” బ్యాడ్జ్ – మిగతా భక్తులకు 

నివాసం (Accommodation)

*భక్తులకు షేర్డ్ (shared accommodation) విధానంలో (గదులు / డార్మిటరీలు) నివాస సదుపాయం కల్పించబడుతుంది*.

*ఏకాదశ రుద్ర పారాయణం  లో పాల్గొనే వారికి డ్రెస్ కోడ్ (Dress Code)*:

మహిళలు: గులాబీ రంగు చీర 

పురుషులు: తెలుపు ప్యాంట్ & తెలుపు షర్ట్ / కుర్తా పైజామా 

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేద పండితులు, వేద అధ్యయన బృందాలు మరియు సాయి భక్తులు పాల్గొనే ఈ మహా పారాయణం, భగవాన్ వారి దివ్య సన్నిధిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసే మహత్తర యజ్ఞంగా నిలవనుంది.

అందరూఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ పాల్గొనవలసిందిగా మనవి.”

🌼 సర్వే జనాః సుఖినో భవంతు

జై సాయిరాం 🙏

సదా శ్రీ సత్యసాయి భగవానుని సేవలో

శ్రీ ఆర్. లక్ష్మణరావు 

రాష్ట్ర అధ్యక్షులు

Comments